హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్పీసీబీ) అధికారుల్లో అలజడి మొదలైంది. ‘నమస్తే తెలంగాణ’ లో ప్రచురితమైన వరుస కథనాలు అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ‘పీసీబీలో కుమ్ములాట’ ‘పీసీబీకి అల్లు డు.. ఇంటర్న్షిప్ పేరుతో బంధువుకు ఉద్యోగం’ కథనాలపై ఉన్నతాధికారులు అంతర్గత విచారణ ప్రారంభించారు. ఏం డ్ల తరబడి విధులకు హాజరుకాకుండా సంతకాలు పెట్టే సదరు అధికారిణి ఎవ రు? ఆమె ఏ విభాగంలో పనిచేస్తారు? ఆమె పేరేమిటని తోటి ఉద్యోగులను ఆరా తీశారు. పీసీబీలో జరుగుతున్న వ్యవహారా లు బయటికి పొక్కడంతో ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. విచారణ జరుపుతూ నే, నమస్తే తెలంగాణ కథనాలకు సంస్థ తరఫున సీనియర్ సోషల్ సైంటిస్ట్ డాక్టర్ ప్రసన్నకుమార్ సోమవారం వివరణ ఇ చ్చారు. పీసీబీలో సిబ్బంది కొరత ఉన్నదని, కొత్త సిబ్బంది నియామకానికి ప్రభు త్వ అనుమతితో టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. భర్తీ ఆలస్యమవుతుండటంతో కొంత మందిని ఇంటర్న్షిప్ పద్ధతిపై బోర్డు నియమించిందని వివరణ ఇచ్చారు.