చౌటుప్పల్, అక్టోబర్ 25 : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ 65వ జాతీయ రహదారిపై ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులు శుక్రవారం రాస్తారోకో చేశారు. అంతకుముందు మూడో రోజు అవార్డు విచారణను బహిష్కరించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం ఆర్డీవో శేఖర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు భూములు ఇవ్వమని, ప్రభుత్వం తక్షణమే అలైన్మెంట్ మార్చాలని రైతులు డిమాండ్ చేశారు. పీఎసీఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, రైతు సంఘం నాయకులు బూర్గు కృష్ణారెడ్డి, భూ నిర్వాసితులు గుజ్జుల సురేందర్ రెడ్డి, దబ్బేటి రాములు గౌడ్, సందగళ్ల మల్లేశం గౌడ్, బోరెం ప్రకాశ్ రెడ్డి, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, జాల శ్రీశైలం యాదవ్, జాల వెంకటేశం యాదవ్, చింతల సుధాకర్ రెడ్డి, తదితరులున్నారు.