ఆలయ భూములను రక్షించండి.. మంత్రి కొండా సురేఖకు వినతి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలోని ఓంకారేశ్వ ర ఆలయానికి సంబంధించిన 1,400 ఎకరాల విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని నందివనపర్తి గ్రామానికి చెందిన ప లువురు మంత్రి కొండా సురేఖకు లేఖ రాశారు.
రంగారెడ్డి, నవంబర్ 27 (నమస్తేతెలంగాణ): రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలోని ఓంకారేశ్వ ర ఆలయానికి సంబంధించిన 1,400 ఎకరాల విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని నందివనపర్తి గ్రామానికి చెందిన ప లువురు మంత్రి కొండా సురేఖకు లేఖ రాశారు. స్థానికులు నీలం సైదులు, పెండ్యాల మధుసూదన్, గోపి తదితరులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నందివనపర్తి గ్రామంలోని అతిపురాతనమైన ఓంకారేశ్వరస్వామి దేవాలయానికి 1,400 ఎకరాల అత్యంత విలువైన భూములు ఉన్నాయి.
ఈ భూములు నజ్దిక్‌సింగారం, కుర్మిద్ద, తాటిపర్తి, నందివనపర్తి గ్రామాల పరిధిలో ఉన్నాయి. ఈ భూములను కొన్నేండ్లుగా రైతులు కౌలు చేసుకుంటున్నారు. ఆలయానికి ఏమీ ఇవ్వటంలేదు. కౌలు తీసుకున్న కొంతమంది ఇతరులకు కౌలుకు ఇచ్చి వారినుంచి పెద్దమొత్తంలో తీసుకుని ఆలయానికి మాత్రం ఇవ్వటంలేదు. మరికొందరు ఆలయ భూములను అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో పాత కౌలుదారుల చెరనుంచి విడిపించి కొత్తవారికి అప్పగించి, ఆలయానికి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి రాసిన లేఖలో కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

