హైదరాబాద్, నవంబర్ 30: హైదరాబాద్‌లో పరుపుల యూనిట్‌ను ప్రారంభించింది రెపోస్ మ్యాట్రిస్. మేడ్చల్ వద్ద నెలకు 6 వేల పరుపులు తయారు చేసే యూనిట్‌తో 400 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ బాలచందర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో పరుపులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ యూనిట్‌ను ప్రారంభించినట్లు, తద్వారా సంస్థ టర్నోవర్ రెండు రెట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.103 కోట్లుగా ఉన్న సంస్థ టర్నోవర్..వచ్చే మార్చి నాటికి రూ.200 కోట్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ నూతన ప్లాంట్‌తో ఈ ప్రాంతంలో అదనంగా 100 డీలర్లను నియమించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లలో 100 డీలర్లు ఉన్నారు. మరోవైపు, సంస్థకు చెందిన పరుపులకు మార్కెట్లో మరింత ప్రచారం కల్పించడానికి ప్రముఖ నటుడు, నిర్మాత ప్రభు దేవాను ప్రచారకర్తగా నియమించుకున్నది. ప్రస్తుతం సంస్థకు కోయంబత్తూరు, పుణె, మీరట్, అహ్మదాబాద్‌లలో యూనిట్లు ఉన్నాయి. జపాన్ పెటెంట్ టెక్నాలజీతో స్మార్ట్‌గ్రిడ్ పరుపులను తయారు చేస్తున్నది సంస్థ.