Tattoo | భువనేశ్వర్, ఏప్రిల్ 11: యూనిఫాంలో ఉన్నప్పుడు సిబ్బంది తమ శరీరంపై టాటూలను కలిగి ఉండరాదని ఒడిశా పోలీసులకు నిబంధన విధించారు. 15 రోజుల్లోగా తమ శరీరాలపై ఉన్న టాటూలను తొలగించుకోవాలని ఆదేశించారు. డ్యూటీలో ఉన్న సిబ్బంది ఒంటిపై టాటూలున్నట్టయితే అది పోలీస్ దళ ప్రతిష్ఠను కించపరిచినట్టేనని భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఈ మేరకు బుధవారం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెక్యూరిటీ), స్పెషల్ సెక్యూరిటీ బెటాలియన్, పోలీస్ కమిషనరేట్, భుశనేశ్వర్ అధికారిక ప్రకటనలో ఆదేశించింది. టాటూలు అభ్యంతకరమనవే కాక అసభ్యకరమైనవి, అవమానకరమైనవని అభివర్ణించింది. ఈ ఆదేశాలను పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.