నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూలై 23 (నమస్తే తెలంగాణ) : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్కో డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ముత్యం వెంకటరమణను ఏసీబీ అధికారులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం ఆయనను 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్కు తరలిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిందితుడిని జైలుకు తరలించా రు.
ఇటీవల డీఎస్పీ భీంరెడ్డిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించిన కొద్ది రోజులకే డీఈని అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. భీంరెడ్డిని తమ కస్టడీలోకి తీసుకుని లోతుగా ప్రశ్నించేందుకు ఏసీబీ కసరత్తు చేస్తున్నది. వెంకటరమణ రూ.400 కోట్ల ఆక్రమాస్తులు కలిగి ఉన్నట్టు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.