హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ డిపార్ట్మెంట్లో 78 అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల నియామక పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ని సోమవారం టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ‘కీ’పై అభ్యంతరాలను ఈ నెల 23 నుంచి 25 సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ సూచించారు. అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను పీడీఎఫ్ ఫార్మాట్లో సమర్పించాలని చెప్పారు. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు సెప్టెంబర్ 20 సాయంత్రం 5 గంటల వరకు https://www.tspsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఈ నెల 8న అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించగా, 12,302 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.