అక్టోబర్‌లో రికార్డుస్థాయి లోటు వర్షపాతం
రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో లోటు వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 89.8 మి.మీ.కు గాను 5.7 మి.మీ. వర్షపాతమే నమోదైంది.
- రాష్ట్రంలో 5.7 మి.మీ.వర్షపాతం
- ఏడు జిల్లాల్లో అధికం..21 జిల్లాల్లో సాధారణం
- 5 జిల్లాల్లో లోటు నమోదు
- వెల్లడించిన తెలంగాణస్టేట్ డెవలప్మెంట్ సొసైటీ
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో లోటు వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 89.8 మి.మీ.కు గాను 5.7 మి.మీ. వర్షపాతమే నమోదైంది. దీంతో మైనస్ 94 శాతంగా లోటు వర్షపాతం నమోదైందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ సొసైటీ వెల్లడించింది. 2021-22 అక్టోబర్ నెలలో 117.8 మి.మీ. వర్షపాతం నమోదవగా, ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నది. నవంబర్ నెలలో 19.9 శాతం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. రెండేండ్లుగా నవంబర్‌లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదు. ఎల్‌నినో ప్రభావంతో నవంబర్‌లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉంది. సాధారణ వర్షపాతం 829.2 మి.మీ., ఉండగా, నవంబర్ 1 వరకు 867.6 మి.మీ., వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్‌లో 72.6 మి.మీ. జులైలో 489.9 మి.మీ. ఆగస్టులో 80 మి.మీ. సెప్టెంబర్‌లో 218.6 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవగా, జోగులాంబ-గద్వాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. నిరుడు ఇదే సమయానికి 1215.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది మైనస్ 29 శాతం లోటు వర్షపాతం నమోదనట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో అధిక వర్షపాతం, 21 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 5 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు టీఎస్‌డీఎస్ వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

