TS Cabinet Meeting | ఏ పరిస్థితులపైనా ఎదుర్కొనేందుకు సిద్ధం : మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో రాష్ట్రంలో కరోనా తీవ్రత, నియంత్రణపై చర్యలపై చర్చించనున్నారు. అయితే, సమావేశం ప్రారంభంలో రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కేబినెట్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా నియంత్రణలోనే ఉందని తెలిపారు. ఏ పరిస్థితులపైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐదుకోట్ల డోసుల టీకాలు వేశామని, అర్హులైన వారందరికీ టీకాలు ఇస్తున్నామన్నారు. ప్రజలు నిబంధనలు పాటిస్తే కరోనాను నియంత్రించవచ్చన్నారు.