Telangana | సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో ఎలుకల స్వైర విహారం.. 12 మంది విద్యార్థినులపై దాడి
Telangana | రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రతి రోజు ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. నిన్న మొన్నటి వరకు అల్పాహారంలో బల్లులు, కలుషితం ఆహారం తిని అస్వస్థతకు గురవడం చూశాం. ఇప్పుడు తాజా మరో అంశం వెలుగులోకి వచ్చింది.
Telangana | మెదక్ : రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రతి రోజు ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. నిన్న మొన్నటి వరకు అల్పాహారంలో బల్లులు, కలుషితం ఆహారం తిని అస్వస్థతకు గురవడం చూశాం. ఇప్పుడు తాజా మరో అంశం వెలుగులోకి వచ్చింది.
మెదక్ జిల్లాలోని రామాయంపేట సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహంలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. పలువురు విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. ఈ ఘటనలో 12 మంది అమ్మాయిలను ఎలుకలు కొరకడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థినులకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎలుకలు సంచరిస్తూ, నిద్రిస్తున్న సమయంలో తమను కొరుకుతున్నాయని ఇప్పటికే పలుమార్లు ప్రిన్సిపాల్‌కు విద్యార్థినులు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదంటూ తల్లిదండ్రులు ఆరోపించారు.
పదేండ్ల క్రితం నాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్ల చారు కనిపించేవి. నేటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి ఏర్పడిందన్నారు. అల్పాహారంలో బల్లులు, చట్నీల్లో చిట్టెలుకలు దర్శనమిస్తున్నాయని నిన్న కేటీఆర్ మండిపడ్డ సంగతి తెలిసిందే.
మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతంగా మారింది. నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లి పడడంతో 20 మంది విద్యార్థులు వాంతులతో ఆస్పత్రుల్లో చేరారు. సుల్తాన్పూర్ జేఎన్టీయూ హాస్టల్లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలెత్తారు. ఈ విషాహారం తింటే.. విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు…? అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడ..? అని కేటీఆర్ నిలదీశారు.
కలుషిత ఆహారం వల్ల.. పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో ఆస్పత్రుల పాలవుతున్నారు. అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే.. విద్యార్థులకు ఈ అవస్థ…! ఈ అస్వస్థత…!! ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలి.. లేకపోతే.. భావిభారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదం. వైఫల్యాలను సరిచేయకపోతే ఊహించని విషాదం ఏర్పడే అవకాశం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
RS Praveen Kumar | కాంగీయుల పాలనను ప్రజలే మట్టుబెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి : ఆర్ఎస్పీ
The Seven Year Itch | పెళ్లయిన ఏడేండ్లకు భార్య మీద ఎందుకంత బోర్ కొడుతుంది.. కారణాలేంటి?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

