హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రక్షాబంధన్ పండుగను సోదర సోదరీమణులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకునేందుకు టీజీఎస్ ఆర్టీసీ వినూత్న ఆలోచన చేసింది. ఇందులోభాగంగా ఆర్టీసీ కార్గో సేవల్లో తోబుట్టువులు పంపే రాఖీలను పార్శిల్ చేయనున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి రాఖీ ఓ అనుబంధమని చెబుతూనే.. ఆ రాఖీని సమయానికి, సురక్షితంగా చేర్చడం తమ బాధ్యతని పేర్కొన్నది. వేగవంతమైన సేవల కోసం ఆర్టీసీ కార్గోను వినియోగించుకోవాలని కోరింది.
‘39% ఫిట్మెంట్ ఇవ్వాలి ’
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికులకు 2021 వేతన సవరణ ఫిట్మెంట్ 39% ఇవ్వాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈ దురు వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం యాజమాన్యానికి ఓ లేఖను రాశారు. ఉద్యోగులకు 2021 నుంచి వేతన సవరణ అమలు జరిగి ఐదేండ్లు దాటినా ఎం దుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు.