కాప్రా, ఆగస్టు 19: తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం అధ్యక్షుడిగా వల్లకాటి రాజ్‌కుమార్ ఎన్నికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఆదివారం ఈ ఎన్నికలు జరిగాయి. అన్ని జిల్లాల నుంచి తెచ్చిన బ్యాలెట్ బాక్సులను ఎల్బీనగర్లోని ఓ ఫంక్షన్ హాలుకు తరలించి, సోమవారం ఓట్లను లెక్కించారు. రాత్రి ఎన్నికల నిర్వాహకులు ఫలితాలను ప్రకటించారు. వల్లకాటి రాజ్‌కుమార్ తన ప్రత్యర్థి బూర మల్లేశంపై 13,401 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు ప్రకటించారు. రాజ్‌కుమార్ మల్కాజిగిరి పద్మశాలీ సంఘం అధ్యక్షుడిగా, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలీ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. పద్మశాలీల అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తానని రాజ్‌కుమార్ తెలిపారు.