ఖైరతాబాద్, మే 20: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే రాజ్‌భవన్‌లో (Raj Bhavan) చోరీ జరిగింది. రాజ్‌భవన్ సుధర్మ భవన్లో నాలుగు హార్డ్ డిస్కులు మాయమయ్యాయి. ఈ నెల 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హార్డ్ డిస్కులు చోరీ గురైనట్లు గుర్తించిన రాజ్‌భవన్ సిబ్బంది పంజాగుట్టా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. శ్రీనివాస్ అనే వ్యక్తిని ఈ నెల 14న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
శ్రీనివాస్.. రాజ్‌భవన్‌లో హార్డ్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడని చెప్పారు. అతడు రాజ్‌భవన్‌లోని క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడని వెల్లడించారు. ఎవరూ లేని సమయంలో తాను పనిచేస్తున్న కంప్యూటర్లోని హార్డ్ డిస్కను చోరీచేశాయని తెలిపారు. ఆలస్యంగా గుర్తించిన ఐటీ మేనేజర్ శ్రీకాంత్.. పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో శ్రీనివాస్‌ను అరెస్టు చేశామన్నారు. విలువైన సమాచారాన్ని తస్కరించేందుకా లేదా మరేదైనా కారణంతో చోరీ చేశాడా అనే కోణంలో దర్యాప్తుచేస్తున్నామని వెల్లడించారు. గతంలో నిందితుడు శ్రీనివాస్‌పై ఫొటోల మార్ఫింగ్‌కు సంబంధించి కేసు నమోదు కాగా, అతను ఈ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చినట్టు సమాచారం.