ఈ నెల 27 వరకు వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 27 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- ఇంకా 24 జిల్లాల్లో లోటు వర్షపాతమే
- తాజాగా రంగారెడ్డి జిల్లా నందిగామలో అత్యధిక వర్షపాతం నమోదు
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 27 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపింది. మంగళవారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టు తెలిపింది. బుధ, గురువారాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని అంచనా వేసింది. గడిచిన 24 గంటల్లో మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి, ములుగు, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా నందిగామలో అత్యధికంగా 5.92 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో 4.80 సెం.మీ, ఆదిలాబాద్ అర్బన్‌లో 4.61 సెం.మీ, బోరాజ్‌లో 4.60 సెం.మీ, జైనాడ్లో 4.45 సెం.మీ, వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్‌లో -36గా నమోదైన లోటు వర్షపాతం
వానకాలం ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. 50 రోజుల్లో సగటున 21 రోజుల పాటు వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు 24 జిల్లాల్లో -18 నుంచి -57 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో-57 శాతం, హనుమకొండలో-54, వరంగల్-49, యాదాద్రి-భువనగిరిలో-46, జనగామలో-45, వికారాబాద్‌లో-37, కరీంనగర్లో-37, హైదరాబాద్‌లో-36, ఆదిలాబాద్‌లో-35, వనపర్తిలో-35, నిజామాబాద్‌లో -33, జగిత్యాలలో-32, నారాయణపేటలో-32, ఖమ్మంలో-30, మహబూబాబాద్‌లో-30, భద్రాద్రి-కొత్తగూడెంలో -29, జయశంకర్ భూపాలపల్లిలో-27, సూర్యాపేటలో-27, నిర్మల్‌లో-26, మహబూబ్‌నగర్‌లో-26, సిద్దిపేటలో-26, మంచిర్యాలలో-20 చొప్పున లోటు వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

