మరో మూడు రోజులు తెలంగాణలో విస్తారంగా వర్షాలు

హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోకి పశ్చిమ, నైరుతి దిశల నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 28వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
గడిచిన 24 గంటల్లో వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు మినహా మిగిలిన అన్నిజిల్లాల్లో వర్షం కురిసినట్లు తెలిపింది. కాగా మేడ్చల్- మల్కాజిగిరి, హైదరాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, జోగులాంబ-గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, కొమురంభీమ్ ఆసిఫాబాద్, వికారాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ కేంద్రం పేర్కొన్నది. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఉప్పల్‌లో 9, సీతాఫల్మండి, వెస్ట్‌మారేడ్‌పల్లి, పికెట్, జోగులాంబ-గద్వాల జిల్లా ఐజ లలో 7, సిద్దిపేట జిల్లా కోహెడలో 8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

