హైదరాబాద్, వరంగల్, మే 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ రైతు సంఘర్షణ సభకు వస్తున్న కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్‌గాంధీకి కొందరు ‘వైట్ చాలెంజ్’ విసిరారు. రాహుల్‌గాంధీ ఇటీవల నేపాల్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో ఉన్న ఫోటోలను ముద్రించి ‘రాహుల్ జీ ఆర్ యూ రెడీ ఫర్ వైట్ చాలెంజ్???’ అంటూ రాసిన ఫ్లెక్సీలు హైదరాబాద్, వరంగల్, హనుమకొండలో వెలిశాయి. డ్రగ్స్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించడం లక్ష్యంగా ‘వైట్ చాలెంజ్’ ప్రచారం అవుతున్నది. దీనిపై రాహుల్‌గాంధీ, పీసీసీ ముఖ్య నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.!