Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Rahul Gandhi | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇతర ప్రతిపక్షాలను, కాక్రోచ్ జనతా పార్టీ వంటి సంస్థలనూ ‘మీరు మా ఛత్రచ్ఛాయలలోకి రాకపోతే మిమ్మల్ని బీజేపీకి బీ-టీమ్ అంటాం’ అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
Rahul Gandhi | అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ 2001లో టెర్రరిజంపై యుద్ధాన్ని ప్రకటించినప్పుడు, ప్రపంచ దేశాలన్నింటిని అందుకు అనుకూలంగా మార్చి తమతో నిలిచేట్టు ఒత్తిడి చేయాలనుకున్నారు. ‘మీరు మాతో లేకుంటే టెర్రరిస్టులతో ఉన్నట్టు లెక్కగడతాం’ అని అన్ని దేశాలను బెదిరించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇతర ప్రతిపక్షాలను, కాక్రోచ్ జనతా పార్టీ వంటి సంస్థలనూ ‘మీరు మా ఛత్రచ్ఛాయలలోకి రాకపోతే మిమ్మల్ని బీజేపీకి బీ-టీమ్ అంటాం’ అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. గతంలో జరిగిన వాటిని కొద్దిసేపు పక్కన ఉంచి ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో ఏమి జరుగుతున్నదో చూద్దాం.
నీట్ పరీక్షల అవకతవకలను నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ జూన్-జూలై నెలల్లో ప్రారంభించిన ఉద్యమానికి అనూహ్యమైన, అపూర్వమైన స్పందన రావడం తెలిసిందే. స్పందించిన వారిలో అత్యధికులు యువతీయువకులు. విద్యాశాఖ మంత్రి రాజీనామాను సాధించడంతో సీజేపీ ప్రతిష్ట ఆకాశాన్నంటింది. ఆ వెంటనే వారు స్కూ ల్ ఠీక్ కరో కార్యక్రమాన్ని చేపట్టి, విద్యారంగం పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదో వీడియో ఆధారాలతో దేశం ముందుకు తేవడంతో వారి పట్ల గౌరవం మరింత పెరిగింది.
ఆ కార్యక్రమం సాగుతుండగానే ఓటర్ల జాబితా సవరణ ఒక కుంభకోణంగా వెల్లడి కావడంతో దానిని సీజేపీ సీరియస్‌గా తీసుకుని యువతను భారీ ఎత్తున కదిలించింది. ఇట్లా వరుసగా జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో వారెక్కడా రాజీపడకపోవడం, తీవ్రమైన పోలీస్ అణచివేతలకు భయపడకపోవడం, మోదీ ప్రభుత్వాన్ని సాహసోపేతంగా ధిక్కరిస్తూ ఉండడంతో యువతరంతోపాటు సమాజానికి కూడా ఒక కొత్త ఆశా కిరణంగా రూపు తీసుకోసాగారు. సరిగ్గా ఇక్కడ మొదలయ్యాయి రాహుల్‌గాంధీ ఎత్తుగడలు. కాక్రోచ్లు జరుపుతూ వస్తుండిన కార్యక్రమాలను (స్కూళ్ల సమస్య మినహా) కాంగ్రెస్ కూడా చేసినప్పటికీ అవి ఒక పరిమిత స్థాయిలో రొటీన్‌గా సాగి మిగిలిపోయాయి. అందుకు కారణం కాంగ్రెస్ పట్ల విశ్వాసమన్నది ఎప్పటి నుంచో సన్నగిల్లుతుండటం.
ఇటువంటి పరిస్థితుల మధ్య రాహుల్ గాంధీ బృందానికి, దేశ యువతరం కాక్రోచ్ల వైపు మళ్లటం, వారి ఆకర్షణ క్రమంగా విస్తరిస్తుండటం సమస్యగా మారింది. దానితో సీజేపీని తమ దారికైనా తెచ్చుకోవాలి, లేదా ఆ సంస్థకు ఏవో ముద్రలు వేసి బదనాం చేయాలనే ఎత్తుగడలు మొదలుపెట్టారు. వారు లొంగి వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో సీజేపీ అనేది బీజేపీకి బీ-టీమ్ అనే ప్రచారాలు మొదలుపెట్టారు. ఆ సంస్థలోని ముఖ్యులు కొందరు లోగడ ఆప్‌లో పని చేసిన వారైనందున ‘ఆప్‌కు బీ-టీమ్’ అని కూడా అన్నారు. కానీ అవేవీ పనికిరాలేదు. ఆ విధంగా రాహుల్ ఎత్తుగడలు విఫలమయ్యాయి.
ఉదాహరణకు సీజేపీ, ఏఐఎస్ఏ చేపట్టిన మొదటి అంశం పరీక్షా పత్రాల లీక్ కాగా, అది ప్రస్తుత బీజేపీ హయాంలోనే గాక లోగడ కాంగ్రెస్ పాలనలోనూ జరిగిందని వారు గుర్తు చేశారు. అదే విధంగా ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు, ప్రభుత్వ పాఠశాలల తీవ్రమైన దుస్థితి కాంగ్రెస్ పాలన రోజుల నుంచి నేటికీ కొనసాగుతున్నదని విమర్శలు చేశారు. ఆందోళనల అణచివేత ఏదో ఒక స్థాయిలో బీజేపీ కన్నా ముందు కూడా కనిపించిందన్నారు.
దానితో ఇటీవల ఒక కొత్త ఎత్తు మొదలుపెట్టారు. అది ద్విముఖవ్యూహం. ఏకకాలంలో ఒకవైపు సీజేపీపై ఎవరికో బీ-టీమ్ అనే ప్రచారం చేస్తూ, మరొకవైపు వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించడం. ఆ విధంగా ప్రచారమన్నది యథాప్రకారం సాగిస్తూనే, తమ నిరసన కార్యక్రమాలకు సీజేపీని ఆహ్వానించడం మొదలుపెట్టారు. సీజేపీపై అణచివేతలను ఖండించారు. యువతరం తన ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు. వారికి తాము మద్దతుగా నిలుస్తామన్నారు. ఇంకా అటువంటివే. తమ గత వారపు నిరసన ప్రదర్శనలో ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా పాల్గొనడంతో రాహుల్‌కు సీజేపీ విషయమై కూడా కొత్త ఆశలు కలిగాయి. ఆ సంస్థ నాయకత్వానికి రాయబారాలు పంపారు. కానీ ఇవేమీ కూడా కాక్రోచ్ నాయకత్వ వైఖరిని మార్చలేకపోయాయి. మొదట నేహా బోరా తాము కాంగ్రెస్ నిరసనలో పాల్గొనడం సర్ సమస్యకు పరిమితమైనదే తప్ప, ఆ పార్టీతో కలిసే ప్రసక్తి లేదని స్పష్టంచేశారు. ఆ తర్వాత సీజేపీ కన్వీనర్ అభిజీత్ దీప్కే కూడా కాంగ్రెస్ కార్యక్రమంలో బయటి నుంచి ఏకీభవిస్తామని, ఆ పార్టీని వ్యతిరేకించబోమని, అంతేగానీ వారితో కలవబోమన్నారు.
ఈ సంస్థల వైఖరికి స్పష్టమైన కారణాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, భారతదేశం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలకు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలదీ బాధ్యత ఉన్నదన్నది ఈ సంస్థల నాయకులు తరచూ ఎత్తిచూపుతున్న విషయం. ఉదాహరణకు సీజేపీ, ఏఐఎస్ఏ చేపట్టిన మొదటి అంశం పరీక్షా పత్రాల లీక్ కాగా, అది ప్రస్తుత బీజేపీ హయాంలోనే గాక లోగడ కాంగ్రెస్ పాలనలోనూ జరిగిందని వారు గుర్తు చేశారు. అదే విధంగా ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు, ప్రభుత్వ పాఠశాలల తీవ్రమైన దుస్థితి కాంగ్రెస్ పాలన రోజుల నుంచి నేటికీ కొనసాగుతున్నదని విమర్శలు చేశారు. ఆందోళనల అణచివేత ఏదో ఒక స్థాయిలో బీజేపీ కన్నా ముందు కూడా కనిపించిందన్నారు.
అటువంటి స్థితిలో వారు కాంగ్రెస్‌తో చేతులు కలిపి పని చేయడం సాధ్యమయ్యేది కాదు. వాంఛనీయం కూడా కాదు. వారు ఆ పని చేసినట్టయితే యువత దృష్టిలో, ప్రజల దృష్టిలో తమ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉన్నది. స్వయంగా కాంగ్రెస్ తన విశ్వసనీయతను కోల్పోతున్నప్పుడు వారితో కలవకపోవడమే సరైన నిర్ణయం అవుతుంది. అయితే దీప్కే, నేహా బోరా స్వయంగా స్పష్టం చేసినట్టు ‘సర్’ అనేది సార్వత్రిక సమస్య అయినందున అందుకు పరిమితమై కాంగ్రెస్‌తో సంఘీభావాన్ని చూపడం వరకు పొరపాటు ఉండదు. పోతే, ఈ సంస్థల కార్యక్రమాలు ఈ రెండు, మూడు అంశాలకు పరిమితమైనవి కావు. వారికి దీర్ఘకాలిక ప్రణాళికలున్నాయి.
కాక్రోచ్ జనతా పార్టీ ఒక స్పష్టమైన లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్ సామాజిక వేదికగా రూపొందుతుండగా, నేహా బోరా సంస్థ ఒక మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీకి అనుబంధమైనది. కాంగ్రెస్ కూడా మొదటి నుంచి లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్ పార్టీ అయినా, గత 30 ఏండ్లుగా ఆ మార్గం నుంచి దారి మళ్లుతూ వస్తున్నది. కనుక ఈ సంస్థలకు కాంగ్రెస్‌తో మైత్రి అనేది అసంబద్ధ విషయం.
అయినప్పటికీ, చింతచచ్చినా అధికారపు కోరికల పులుపు చావని రాహుల్‌కు వేస్తూ వస్తున్న ఎత్తుగడల్లో ఒకటి, ఇతర ప్రతిపక్షాలను ‘మీరు మాతో లేకుంటే బీజేపీతో ఉన్నట్టే, వారికి బీ-టీమ్ అయినట్టే’ అని ఆరోపించడం. కానీ ఈ చవకబారు ఎత్తుగడలు పని చేయడం లేదు. కాంగ్రెస్ వాళ్లు ఇదే మాట బీఆర్ఎస్ గురించి కూడా అనడం తెలిసిందే. ఆప్, టీఎంసీ వంటివి కూడా ఈ ప్రచారానికి గురయ్యాయి. ప్రస్తుతం కాక్రోచ్‌లను కాంగ్రెస్ లక్ష్యం చేసుకున్నారు. తమ అధికారం కోసం వారిని కబలించాలన్నది ఎత్తుగడ. రాహుల్ గాంధీ ప్రదర్శిస్తున్న ఇటువంటి అసమర్థ దుర్జనత్వ ఎత్తుగడలు కూడా ‘ఇండి’ కూటమి గందరగోళానికి ఒక ముఖ్య కారణం. సీజేపీ విషయానికి వస్తే, ఆ సంస్థపై ఈ తరహా కుయుక్తుల వల్ల తాము యువతరానికి, సమాజానికి మరింత దూరం కాగలమనే వివేకం రాహుల్ గాంధీకి కలుగడంలేదు.
– టంకశాల అశోక్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- CJP
- Congress
- Indian Politics
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

