హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం కులగణనలో భాగంగా నిర్వహించనున్న సర్వేలో కాంగ్రెస్ సర్కారు తీరుపై 76వ ప్రశ్ననూ పొందుపర్చాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి సూచించారు. కులగణనలో 75 ప్రశ్నల ఫార్మాట్ రూపొందించారని, వీటితోపాటు 11 నెలల్లో ప్రజలు ఎదురొంటున్న సమస్యలపై తెలుసుకోవాలని సూచించారు. 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని, పంటలన్నింటికీ రూ.500 బోనస్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకున్నది నిజమా? అలాగే రుణమాఫీ పొందిన విషయాన్ని తేల్చుకోవాలని, ఈ విషయాల్లో రైతులు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాహుల్‌గాంధీని వరంగల్ ఏనుమాముల మార్కెట్‌కు తీసుకెళ్లి పరీక్షించుకోవాలని సూచించారు. రెండు లక్షల ఉద్యోగాల్లో నిజమెంతో నిరుద్యోగుల దగ్గరికి రాహుల్‌ను తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను గాలికి వదిలేసి వాటిపై గొప్పలు చెప్పుకునే దౌర్భాగ్యం వచ్చిందని మధనడుతూ.. బయట తిరిగేందుకు భయపడుతున్నారో లేదో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.