Inter Hall Tickets | హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : మీరు ఇంటర్ వార్షిక పరీక్షలు రాయబోతున్నారా? ఒక వేళ మీ పరీక్షాకేంద్రం సెంటర్ తెలియకపోతే డోంట్ వర్రీ. హాల్‌టికెట్లపై పరీక్షాకేంద్రం లొకేషన్ క్యూ ఆర్‌కోడ్ రూపంలో ఉంటుంది. ఈ క్యూఆర్‌కోడ్‌ను స్కాన్‌చేయగానే మీ పరీక్షాకేంద్రం అడ్రస్ తెలిసిపోతుంది. మీరు ఉండే ప్రాంతం నుంచి సెంటర్ ఎంత దూరమో.. ట్రాఫిక్ ఎలా ఉందో.. ఎన్ని నిమిషాల్లో చేరుకోగలరో కూడా చెబుతుంది.
ఇలాంటి ప్రత్యేకతలతో హాల్‌టికెట్లను ఇంటర్‌బోర్డు సిద్ధం చేస్తున్నది. ఇలా క్యూఆర్‌కోడ్‌తో హాల్‌టికెట్లు జారీచేయడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభంకానున్నాయి. వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు సులభంగా పరీక్షాకేంద్రాలకు చేరుకునేందుకు ఇంటర్‌బోర్డు ఇలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్‌బోర్డు డైరెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు.