హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ) : ప్రముఖ వ్యాపారవేత్త, చందన బ్రదర్స్ వ్యవస్థాపకులైన చందన మోహన్రావు(82) సోమవారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్రావు విశాఖపట్నంలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మోహన్రావు 1943లో జన్మించగా… చిరుద్యోగి నుంచి చందన బ్రదర్స్ షోరూం ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారు.
సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2002లో సీఎంఆర్ షాపింగ్మాల్స్ను తొలిసారిగా పరిచయం చేసిన ఆయన తెలుగు రాష్ర్టాలతోపాటు ఒడిశా, కర్ణాటక రాష్ర్టాలకు వస్త్ర పరిశ్రమను విస్తరించి, వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించారు. ఎంతోమంది వ్యాపారులకు ఆదర్శంగా నిలిచారు. ఆయన తమతో లేకపోవడం తీరని లోటు అని, సీఎంఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సేవలు అందించారని సీఎంఆర్ టెక్స్టైల్స్ అండ్ జువెల్లరీ సంస్థ ప్రకటనలో పేర్కొన్నది.