శంషాబాద్ రూరల్, మార్చి 26: సరూర్నగర్ యువతి హత్య కేసులో నిందితుడికి ఎల్బీనగర్ కోర్టు రూ. 10లక్షల జరిమానాతోపాటు జీవితఖైదు విధించినట్టు శంషాబాద్ రూరల్ పోలీసులు తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ర్టానికి చెందిన అప్సర ఆమె తల్లి ఇద్దరు హైదరాబాద్కు వలసవచ్చి సరూర్నగర్లో నివాసమున్నారు. స్థానిక ఆలయంలో పూజారిగా ఉన్న సాయికృష్ణతో అప్సరకు పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెను ప్రేమపేరుతో శారీరకంగా లోబర్చుకున్న సాయికృష్ణను వివాహం చేసుకోవాలని అప్సర ఒత్తిడితెచ్చింది. ఈక్రమంలో ఆమెను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని సాయికృష్ణ పథకం రచించాడు. ఈ నేపథ్యంలోనే 2023 జూన్ 3న కోయంబత్తూర్కు వెళ్దామని సరూర్నగర్ నుంచి కారులో ఆమెను తీసుకెళ్లాడు. శంషాబాద్ మండలం నర్కూడ శివారులో రోకలిబండతో మోది అతిదారుణంగా హత్యచేశాడు.