Tomato Price | రికార్డు స్థాయికి టమాట ధర.. కిలో రూ.155.. ఎక్కడంటే?
కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అందులో టమాట (Tomatoes) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టమాట ధర రికార్డు స్థాయికి చేరడంతో సాధారణ ప్రజలు వాటిని కొనాలంటేనే జడుసుకుంటున్నారు.
కోల్కతా: కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అందులో టమాట (Tomatoes) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టమాట ధర రికార్డు స్థాయికి చేరడంతో సాధారణ ప్రజలు వాటిని కొనాలంటేనే జడుసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కిలో టమాట ధర రూ.58 నుంచి రూ.148 పలుకుతున్నది. అయితే కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Consumer affairs ministry) ప్రకారం పశ్చిమబెంగాల్లోని (West Bengal) పురులియా (Purulia) ప్రాంతంలో మాత్రం అత్యధికంగా రూ.155కు చేరింది. ఎడల తీవ్రత పెరగడం, రూతుపవనాల రాక ఆలస్యమవడంతో టమాటా ఉత్పత్తి తగ్గిపోయిందని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
కాగా, ముంబైలో (Mumbai) అతితక్కువగా కిలో రూ.58 పలుకుతుండగా, ఢిల్లీలో (Delhi) రూ.110, చెన్నైలో (Chennai) రూ.117, కోల్కతాలో రూ.148కి (Kolkata) చేరిందని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ.83.29కు లభిస్తున్నదని పేర్కొంది. అయితే ప్రాంతాన్ని, అమ్మకపుదారులను బట్టి రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతున్నదని చెప్పింది. ఢిల్లీలో స్విగ్గీ ఇన్స్టామార్ట్, బ్లిన్కిట్ వంట్ ఆన్లైన్ షాపింగ్ అప్లికేషన్స్ కిలో రూ.140 అమ్ముతున్నాయని వెల్లడించింది. ప్రస్తుత సీజన్ కారణంగా ధరలు అమాంతం పెరిగిపోయాయని, మరో 15 నుంచి నెల రోజుల్లో అవి దిగివచ్చే అవకాశం ఉందని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

