హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): పోలీసు సిబ్బంది ఆర్థిక ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సూచించారు. రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి (ఆర్బీవీఆర్ఆర్) తెలంగాణ పోలీస్ అకాడమీ (టీజీపీఏ)లో మంగళవారం ప్రీ ప్రమోషనల్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే డబ్బులను మంచి రాబడి వచ్చే రంగాల్లో పెట్టుబడి పెట్టాలని సూచించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఆర్బీవీఆర్ఆర్, టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిస్త్ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులు, బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని తెలిపారు.