హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కవాడిపల్లి గ్రామంలో తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఆర్ఎస్సీఎల్)కు చెందిన భూముల వేలంపై వచ్చే ఐదవ తేదీ ఉదయం 11 గంటలకు కవాడిపల్లి సైట్లో రెండవ ప్రీబిడ్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) తెలిపింది.
ఈ-ఆక్షన్‌లో పాల్గొనాలనుకునేవారు ఈ సమావేశానికి హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని టీఎస్ఐఐసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వెంకటనర్సింహారెడ్డి తెలిపారు. వేలం వేయనున్న భూముల వివరాలు www. tsiic.telangana.gov.in, www.mstce commerce. com, www. swagruha.telangana. gov.in తదితర వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. అంతేకాకుండా 9441218461, 9701452763, 9951933005 ఫోన్ నంబర్లపై సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు. ఈ భూముల వేలానికి సంబంధించి గత నెల 13న నోటిఫికేషన్ ఇవ్వగా, 27న మొదటి ప్రీబిడ్ సమావేశాన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు.