BRS Bhavan | ఢిల్లీ బీఆర్ఎస్ భవన్లో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు
ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ భవన్లో (BRS Bhavan) పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth reddy), ఎంపీ సంతోష్ కుమార్ (MP Santhosh kumar), ఎంపీ వెంకటేశ్ నేత పూజలో పాల్గొన్నారు.
ఢిల్లీ: ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ భవన్లో (BRS Bhavan) పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth reddy), ఎంపీ సంతోష్ కుమార్ (MP Santhosh kumar), ఎంపీ వెంకటేశ్ నేత పూజలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1.05 గంటలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆఫీసును ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్నారు.
ఢిల్లీ వసంత్ విహార్‌లో బీఆర్ఎస్ ఆఫీసు నిర్మాణానికి 2021, సెప్టెంబర్ 2న సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. మొత్తం నాలుగు అంతస్థులతో 11 వేల చదరపు అడుగుల స్థలంలో దీనిని నిర్మించారు. లోయర్‌గ్రౌండ్‌లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇక గ్రౌండ్‌ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల చాంబర్లు, మొదటి అంతస్థులో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ చాంబర్, ఇతర చాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్, 2వ, 3వ అంతస్థుల్లో మొత్తం 20 గదులు ఉన్నాయి. వీటిలో పార్టీ ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్‌పోగా మిగతా 18 ఇతర రూములు అందుబాటులో ఉంటాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS Bhavan
- BRS office
- CM KCR
- Delhi
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

