పాట్నా, సెప్టెంబర్ 10: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ఐదుగురు పోలీసులను లాకప్‌లో ఉంచాడో ఎస్పీ. బీహార్‌లోని నవడా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్పీ గౌరవ్ మంగ్లా 8న రాత్రి 9 గంటలకు స్టేషన్‌కు వచ్చి అధికారుల పనితీరుపై సమీక్షించారు. అయితే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు శత్రుఘ్న పాశ్వాన్, రాంరేఖా సింగ్, ఏఎస్సైలు సంతోష్ పాశ్వాన్, సంజయ్ సింగ్, రామేశ్వర్ ఉరాన్ను లాకప్‌లో ఉంచి తాళం వేశారు. రెండు గంటల తర్వాత వారిని విడిచిపెట్టారు. ఎస్పీపై చర్యలు తీసుకోవాలని బీహార్ పోలీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.