ఖమ్మంలో భారీ వర్షాలు.. పోలీస్ యంత్రాంగం అప్రమత్తం
భారీ వర్షాలు | గులాబ్ తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీగా వర్షం కురుస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్

ఖమ్మం: గులాబ్ తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీగా వర్షం కురుస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఆదేశించారు. వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో స్థానిక పోలీసులు తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్లు, గ్రామాలు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే పర్యవేక్షించి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
చెరువులు, కుంటల వద్ద నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వంతెనలు, చప్టలపై బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ప్రమాదాల భారీన పడకుండా వాహనాల రాకపోకలను నిషేధించాలని సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ఆవకాశం ఉండటంతో రోడ్డు రవాణా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా విద్యుత్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.

మరో రెండు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

