హైదరాబాద్ : తెలంగాణ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ‘కీ’ విడుదలైంది. ప్రాథమిక ‘కీ’ని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ నెల 31వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ప్రాథమిక కీ కోసం www.tslprb.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.
సివిల్, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సివిల్ ఇతర విభాగాల్లో 15,644, రవాణాశాఖలో 63, ఎక్సైజ్‌శాఖలో 614 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నియామకానికి గత ఏప్రిల్‌లో నోటిషికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. ఆయా పోస్టులకు 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా.. 6,03,955 మంది అభ్యర్థులు హాజరవగా.. 91.34 శాతం హాజరు నమోదైందని టీఎస్ఎల్పీఆర్బీ పేర్కొంది.