చండూరు, డిసెంబర్ 6: వ్యక్తిగత పనుల మీద వెళ్తున్న నల్లగొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్‌రెడ్డిని నల్లగొండ టూటౌన్ పోలీసులు వెంబడించడం, మూడు గంటలపాటు కదలనీయకుండా నిర్బంధించడం వివాదాస్పదమైంది. శనివారం ఉద యం ఆయన తన వ్యక్తి గత పని మీద నల్లగొండ నుంచి మర్రిగూడెం మండలం శివన్నగూడెం గ్రామానికి బయలుదేరారు. అయితే, ఆయనను నల్లగొండ టూటౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, వన్‌టౌన్ ఎస్సై సైదులు నల్లగొండ నుంచి వెంబడించారు.
చివరకు చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడీపేట వద్దకు చేరుకున్న తరువాత రోడ్డు మీద సినీ ఫక్కీలో నిలిపివేశారు. కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనానికి పోలీస్ వాహనాల్ని అడ్డు పెట్టి, ఆయనను కారులోనే సుమారు 3గంటలపాటు రోడ్డుపైనే ఉంచారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ చండూరు పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీశ్, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రం వెంకట్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, అధికార ప్రతినిధి బొడ్డు సతీశ్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ అన్నెపర్తి శేఖర్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగోని వెంకన్నగౌడ్, తదితరులు చేరుకున్నారు.