Pocso case | కేయూ పోలీస్ స్టేషన్లో సీఐపై పోక్సో కేసు నమోదు
Pocso case | కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో(KU police station) సీఐపై పోక్సో కేసు నమోదైంది.
వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో(KU police station) గతంలో ఎస్ఐగా పని చేసి ప్రస్తుతం సీఐగా పొరుగు జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారి పై ఫోక్స్(POCSO case) చట్టం కింద కేసు నమోదైనట్లు అధికారక సమాచారం. 2022లో కేయూలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో సదురు అధికారి స్టేషన్ పరిధిలో ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు నెరిపినట్లు తెలిసింది.
ఈ విషయంలో సదరు మహిళ భర్త పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా ఏఆర్‌కు అటాచ్ చేశారు. అనం తరం సీఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు, అటునుంచి భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లిన సదురు అధికారి ఇంకా మహిళతోనే సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలిసింది.
ఈ క్రమంలో సదరు మహిళ కూతురిపై కన్నేసిన పోలీస్ అధికారి లైంగిక దాడికి యత్నించినట్లు ఇటీవల కేయూ పీఎస్‌లో బాలిక తల్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గురువారం సదరు అధికారిపై లైంగికదాడికి యత్నం, ఫోక్స్ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై కేయూ సీఐని వివరణ కోరగా నిజమే అని చెప్పారు. కేయూ పీఎస్‌లో కేసు నమోదు అయిందని, కస్టడీలో ఉన్నాడని చెప్పారు. రహస్యంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

