రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం : వినోద్ కుమార్
Vinod Kumar | సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే జీఎంను టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా రైల్వే జీఎంకు వివిధ పార్టీల నేతలు వినతిపత్రాన్ని అందజేశారు.

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే జీఎంను టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా రైల్వే జీఎంకు వివిధ పార్టీల నేతలు వినతిపత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని వినతి చేశారు. కాజీపేటలో వ్యాగన్, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
జీఎంను కలిసిన అనంతరం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ నేతలు సహకరించాలి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విభజన చట్టంలో ఉందన్నారు. కోచ్ ఫ్యాక్టరీకి గతంలోనే భూసేకరణ, నిధులు ఇచ్చామని గుర్తు చేశారు. భూసేకరణ జరిగినా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేబినెట్ భేటీలో నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై పార్లమెంట్లో ప్రకటన చేయాలన్నారు. ప్రకటన చేయకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కోచ్ ఫ్యాక్టరీ విషయమై మోదీని పలుసార్లు కలిసి సీఎం కేసీఆర్ అడిగారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. మోదీ సర్కార్ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల్లో అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే బడ్జెట్‌ను కేంద్రం విస్మరించడం దారుణమన్నారు. రైల్వే ప్రయివేటీకరణతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగ అవకాశాల్లో అవకాశం ఉండదని స్పష్టం చేశారు. రేపటి బడ్జెట్లో రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని వినోద్ కుమార్ కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

