ఫోన్ ట్యాపింగ్ కేసు ఆగస్టు 20కి వాయిదా
ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామని రాష్ట్ర ప్ర భుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇప్పటికే పోలీస్ కమిషనర్ వేసిన కౌంటర్లోని వి షయాలను అన్వయించుకోబోమని స్ప ష్టం చేసింది.
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తె లంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇప్పటికే పోలీస్ కమిషనర్ వేసిన కౌంటర్లోని విషయాలను అన్వయించుకోబోమని స్పష్టం చేసింది. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ (సస్పెన్షన్) భుజంగరావు హైకోర్టు న్యా యమూర్తుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు ఇచ్చిన వాంగ్మూలం ఆధారం గా పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతున్నది. విచారణను ఆగస్టు 20కి వా యిదా వేస్తున్నట్టు ప్రధాన న్యాయమూ ర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ప్రకటించింది. ఈ కేసులో అధికారాలన్నీ హోం శా ఖ కార్యదర్శికే ఉన్నందున ఆయన కౌం టర్ వేస్తారని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ చె ప్పారు. కేంద్రం తరఫున కూడా కౌంటర్ వేస్తామని అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ చెప్పారు.
హరీశ్‌రావు చేయించారంటూ..
తన ఫోన్‌ను బీఆర్ఎస్ నేత టీ హరీశ్‌రావు ట్యాపింగ్ చేయించారని గత అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన చక్రధర్‌గౌడ్ దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్ బీ రెడ్డి మంగళవారం విచారించారు. జూన్ 19న డీజీపీకి వినతి పత్రం ఇచ్చినా చర్యలు తీసుకోలేదనే పిటిషన్‌పై ప్రభుత్వ వివరణ నిమిత్తం విచారణ ఆగస్టు 6కు వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

