హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అండ్ యుటిలైజేషన్ విభాగంలో పీజీ పూర్తి చేసిన గిల్లెల శ్వేతకు కెనడాలోని లావల్ విశ్వవిద్యాలయంలో వుడ్సైన్స్లో పీహెచ్డీ చేసేందుకు అవకాశం లభించింది. పూర్తి సాలర్షిప్, ఫీజు మినహాయింపుతో ప్రతిష్ఠాత్మకమైన విదేశీ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసేందుకు అవకాశం లభించిన శ్వేతను ములుగు ఫారెస్ట్ కాలేజీ డీన్ ప్రియాంకవర్గీస్ అభినందించారు.