హైదరాబాద్, అక్టోబర్ 15, (నమస్తే తెలంగాణ): నారాయణపేటకొడంగల్ ఎత్తిపోతల పథకం కాంట్రాక్ట్ కేటాయింపును సవాలు చేస్తూ ఏఐసీసీ మాజీ సభ్యుడు బకా జడ్సన్ దాఖలు చేసిన పిటిషన్ను నంబర్ కేటాయింపు దశలోనే హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్పై రిజిస్ట్రీ అభ్యంతరాలను ఆమోదించింది. రాజకీయ ఉద్దేశాలతో దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు అనుమతించలేమని తేల్చిచెప్పింది. పిటిషనర్ జడ్సన్కు ఆ అర్హత లేదని బెంచ్ స్పష్టంచేసింది.