
కరీంనగర్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు హుజూరాబాద్ నియోజకవర్గంలోని దూదేకుల కులస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు. తీర్మాన పత్రాన్ని ఆదివారం రాత్రి మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌కు తెలంగాణ ముస్లిం, నూర్‌బాషా దూదేకుల వృత్తి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సిద్దా సాహెబ్ ఆధ్వర్యంలో అందించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపునకు కృషి చేస్తామని స్పష్టంచేశారు.