Peddi Sudarshan Reddy | కాంగ్రెస్ నేతలకు.. కమీషన్లు, పంపకాల మీద ఉన్న దృష్టి పాలనపై లేదు: మాజీ ఎమ్మెల్యే పెద్ది
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అన్నారు. కాంగ్రెస్ పాలనలో హత్యలు, నేరాలు పెరిగిపోయాయని విమర్శించారు. హామీలపై నిలదీస్తే అధికార పార్టీ నేతలు పోలీసులతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
వరంగల్: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అన్నారు. కాంగ్రెస్ పాలనలో హత్యలు, నేరాలు పెరిగిపోయాయని విమర్శించారు. హామీలపై నిలదీస్తే అధికార పార్టీ నేతలు పోలీసులతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన నర్సంపేటలో మీడియాతో మాట్లాడారు. గిరిజన కుటుంబంపై దాడి ఘటనతో పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతున్నదని చెప్పారు. ప్రశ్నిస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్యేలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు పైసా నిధులు తేలేదని విమర్శించారు.
కాంగ్రెస్ నేతల అడుగులకు మడుగులొత్తే అధికారులకు పోస్టింగులు ఇస్తున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా పోలీస్ అధికారుల బదిలీలు జరుగుతున్నాయని చెప్పారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ నేతలకు కమీషన్లు, పంపకాల మీద ఉన్న దృష్టి పాలనపై లేదని విమర్శించారు. గ్రామాల్లో ఆ పార్టీ నేతల వేధింపులు పెరిగాయన్నారు. ఏ పోలీస్ స్టేషన్ చూసినా రోజూ వందలమంది కనిపిస్తున్నారని చెప్పారు. పోలీసు పోస్టులను కాంగ్రెస్ నేతలు బేరాలకు పెట్టారని ఆరోపించారు. ఏ కార్యకర్తకు కష్టమొచ్చినా ఉమ్మడి జిల్లా నేతలంతా వస్తారని చెప్పారు. ఎక్కడ అన్యాయం జరిగినా నిలదీస్తామన్నారు.
LIVE | BRS Leaders Press Meet at Narsampet @PSRNSPT https://t.co/O4uo7Iam80
— BRS Party (@BRSparty) July 12, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

