KCR | కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం
KCR | తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన తమ్ముడి కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు.
KCR | తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫిరాయింపు నేత, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలుసుకున్నారు. తన తమ్ముడి కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. అయితే ఫిరాయింపు నేతల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలో చెప్పాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫిరాయింపుదారులపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఎదురుచూస్తున్న తరుణంలో కేసీఆర్‌ను మహిపాల్ రెడ్డి కలవడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కొంతకాలానికే ఆయన యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్‌లో అనధికారికంగా కొనసాగుతున్నప్పటికీ.. పలు సందర్భాల్లో బీఆర్ఎస్కు, కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అంతెందుకు పటాన్‌చెరులోని తన క్యాంపు కార్యాలయంలో కూడా కేసీఆర్ ఫొటోనే పెట్టుకున్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించినప్పటికీ.. బరాబర్ కేసీఆర్ ఫొటో ఉంచుకుంటానని స్పష్టం చేశారు. పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో సహకరించారని గుర్తుచేశారు. క్యాంపు కార్యాలయం తన నివాసమని, ఇక్కడ కేసీఆర్ ఫోటో పెట్టుకోవడంలో తప్పేమిటని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

