హైదరాబాద్ : ఈ నెల 10వ తేదీ నుంచి 14 తపాలా కార్యాలయాల్లో పాస్ పోర్టు సేవలు పునరుద్ధరణ కానున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో గత నెల 12 నుంచి పాస్ పోర్టు సేవలు ఆగిపోయాయి. అత్యవసరంగా విదేశాలకు వెళ్లే వారికి మాత్రమే లాక్డౌన్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపులతో తపాలా కార్యాలయాల్లో పాస్ పోర్టు సేవలు రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. సాధారణ సమయాల్లో పాస్ పోర్టు సేవా కేంద్రాలు పని చేయనున్నాయి.