ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టా
రాష్ట్రంలోని ప్రతి గడపకు కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇందులో నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష కుటుంబాల గడపలు కూడా ఉన్నాయి.
- 50 ఏండ్లుగా పోడు సాగులో ధనసరి కుటుంబం
- ఎకరం 17 గుంటల భూమికి ప్రభుత్వం పట్టా
- పట్టా రావడం సంబురంగా ఉన్నది: సమ్మయ్య
- భూమి విషయంలో ఇక భయం లేదు: సమ్మక్క
ములుగు, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి గడపకు కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇందులో నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష కుటుంబాల గడపలు కూడా ఉన్నాయి. అర్హులుగా నిర్ధారణ అయితే ప్రతిపక్ష పార్టీల కుటుంబాల సభ్యులకు కూడా పథకాలు దక్కుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తనపర భేదాలు, రాజకీయ వైషమ్యాలు లేకుండా అర్హులైన ప్రతిఒక్కరికీ పథకం అందజేస్తున్నది. ఇందుకు పోడు పట్టాల పంపిణీ ఒక నిదర్శనం. సంబురంగా పోడు పట్టా అందుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క తల్లిదండ్రులే ప్రత్యక్ష సాక్ష్యం. ములుగు మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) తల్లిదండ్రులు ధనసరి సమ్మయ్య-సమ్మక్క సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టా గురువారం పోడు పట్టాను అందుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం సీతక్క తండ్రి సమ్మయ్యకు ఎకరం 17గంటల భూమి పట్టాపాస్ పుస్తకాన్ని జడ్పీటీసీ భవాని, ఎంపీపీ శ్రీదేవి, తహసీల్దార్ సత్యనారాయణస్వామి, ఎంపీటీసీ విజయ్‌రాంనాయక్, సర్పంచ్ సువర్ణరాణి అందించారు.
50 ఏండ్లుగా పోడు సాగు..
సీతక్క తల్లిదండ్రులు పోడు పట్టా అందుకున్న విషయం తెలుసుకున్న ‘నమస్తే తెలంగాణ’ బృందం వారి స్వగ్రామం జగ్గన్నపేటకు చేరుకొని పలుకరించింది. సీతక్క తండ్రి సమ్మయ్య మాట్లాడుతూ.. 50 ఏండ్లుగా ఎకరం 17 గుంటల భూమిని సాగు చేస్తున్నానని, ప్రస్తుతం చేత కాకపోవడంతో వేరేవారితో వ్యవసాయం చేయిస్తున్నట్టు తెలిపారు. ఊహ తెలిసిన నాటి నుంచి నేటి వరకు వ్యవసాయమే ప్రాణంగా భావించి పంటలు పండించానని చెప్పారు. ఈ 50 ఏండ్లలో పోడు భూములు దున్నేందుకు చాలా మంది రైతులు భయపడే వారని, ఫారెస్టు అధికారులు కూడా ఇబ్బందులు పెట్టే వారని తెలిపారు. సీతక్క తల్లి సమ్మక్క మాట్లాడుతూ.. ఇప్పుడు తమ భూమికి పట్టా రావడం ఎంతో ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు. తమతోపాటు గ్రామంలోని దోమ ముత్తయ్య, ఐలు ముత్తయ్య, సారమ్మ, అజ్మీరా సర్దార్కు పట్టాలు వచ్చాయని వివరించారు. ‘అప్పట్ల పట్టా లేనందున ఎవరు వత్తరో, ఎవలు పోతరో, ఏమంటరో అని అందరు భయపడేది. ఇప్పుడు ఆ భయం లేదు. పట్టా భూమిని నా బిడ్డ సీతక్క కన్నా, నా కొడుకు పిల్లల కన్నా ఇస్తం’ అని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Murasu | మురాసు తుపాను ప్రభావం.. తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు!
RGV | హింసకు సినిమాలే కారణమంటే… కిడ్నాప్‌లకు రామాయణాన్ని అనాల్సిందే: ఆర్జీవీ
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

