పెద్దపల్లి , ఏప్రిల్ 28 : ఈ చిత్రంలో కన్పించేది పాము అనుకుంటున్నారా? కానే కాదు. ఇది చేప. దీన్ని మలుగు పాపెర అంటారు. ఇది అరుదైన జాతి. చెరువులు, రిజర్వాయర్లలో ఉండే ఈ చేప దొరికితే అదృష్టమే. అనేక ఔషధ గుణాలు ఉండే ఈ చేప ఆరోగ్యానికి ఎంతో మంచిది.
నడుం, మోకాళ్ల నొప్పులు ఇట్టే నయమవుతాయంటారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అరెంద వద్ద సరస్వతీ బరాజ్ బ్యాక్ వాటర్లో శుక్రవారం రొయ్యల కోసం మత్స్యకారుడు చెన్నూరి సాయి పెట్టిన బుట్టకు చిక్కడంతో సంబురపడ్డాడు. స్థానికులు విక్రయించాలని కోరినా ససేమిరా అన్నాడు. ఇంటికి తీసుకెళ్లి కూర చేసుకున్నాడు.