తాటిచెట్టుపై తలకిందులుగా గీతకార్మికుడు.. 8 గంటలు నరకయాతన
ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై మోకు జారడంతో ఒరిగిన ఓ గీత కార్మికుడు 8 గంటలపాటు నరకయాతన పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని శేరిగూడెంలో శుక్రవారం చోటుచేసుకున్నది
- శేరిగూడెంలో ఘటన
సంస్థ్ధాన్ నారాయణపురం, అక్టోబర్ 14: ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై మోకు జారడంతో ఒరిగిన ఓ గీత కార్మికుడు 8 గంటలపాటు నరకయాతన పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని శేరిగూడెంలో శుక్రవారం చోటుచేసుకున్నది. శేరిగూడెం గ్రామానికి చెందిన మాసయ్య (57) రోజు మాదిరిగానే ఉదయం తాటి చెట్టుపైకి చేరుకున్నాడు. ప్రమాదవశాత్తు మోకు జారడంతో ఒక్కసారిగా తలకిందులుగా వేలాడాడు.
సుమారు 8 గంటలపాటు అలాగే ఉండిపోయాడు. చుట్టుపక్కల వారు మాసయ్యను కాపాడే ప్రయత్నం చేయగా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఏసీపీ ఉదయ్‌రెడ్డి ఆధ్వర్యంలో క్రేన్ సహాయంతో మాసయ్యను ప్రాణాలతో కిందకు దింపారు. కాపాడిన వారిలో ఎస్సై యుగంధర్ కూడా ఉన్నారు. అనంతరం అతడిని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దవాఖాన వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

