హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఎస్టీసీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా అయినేని సంతోష్‌కుమార్ ఎన్నికయ్యారు. 2022 -24 సంవత్సరాలకు అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు.
ప్రధాన కార్యదర్శులుగా బీ అనంతరామ్, డీ శ్రీనివాస్, సలహాదారుడిగా డాక్టర్ రమేశ్‌బాబు, ఉపాధ్యక్షులుగా ఎన్ సుగుణాకర్, కే రాజు, కోశాధికారిగా అర్జున్, కార్యదర్శులుగా జీ చంద్రశేఖర్, రాజు, కార్యవర్గ సభ్యులుగా డీ సూర్యచంద్ర, ఎం కిశోర్, జీ దుర్గ, సాంకేతిక నిపుణుడిగా ఫణి శ్రీకాంత్‌ను ఎన్నుకున్నారు.