వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 7: కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో త్వరలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. సెప్టెంబర్ 28న కార్డియోథొరాసిక్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అల్లాడి సృజన్, డాక్టర్ రితీశ్ల ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన వడ్డెపల్లి స్వప్న(31)కు ఓపెన్‌హార్ట్ సర్జరీ నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఎంజీఎం సూపరింటెండెంట్‌తో పాటు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్ ఆమె ఆరోగ్య స్థితిని పరిశీలించి, తగిన సూచనలు చేసి డిశ్చార్జ్ చేశారు.
హైదరాబాద్ త ర్వాత అంతటి వైద్యసేవలను ఉత్తర తెలంగాణవ్యాప్తంగా ఉన్న పేదలకు అందించేందుకు ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడానికి తమ వైద్యుల బృందం నిర్విరామంగా సేవలను కొనసాగించడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉంటుందని అన్నారు.