పెండ్లిళ్లకు 40 మంది, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి
లాక్డౌన్ | పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే

హైదరాబాద్ : కరోనా ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం రేపట్నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్‌ను విధించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది.
అందుబాటులో ప్రజా రవాణా
తెలంగాణ చుట్టూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది అని స్పష్టం చేసింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి. కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది. సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు మూసి వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. పైన తెలిపిన మినహాయింపులను పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని క్యాబినెట్ ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
Lockdown : రేపట్నుంచి తెలంగాణలో లాక్డౌన్
తెలంగాణలో యథావిధిగా ధాన్యం కొనుగోళ్లు
తెలంగాణలో కొత్తగా 4,801 కరోనా కేసులు.. 32 మంది మృతి
తెలంగాణలో లాక్డౌన్ మార్గదర్శకాలు ఇవే..వీటికే అనుమతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

