హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): క్యాల్కస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఐఐటీ, ఐఐఎం పూర్వ విద్యార్థుల సహకారంతో దేశవ్యాప్తంగా ప్రముఖ పోటీ పరీక్షల సన్నద్ధత కోసం రూపొందించిన క్యాల్కస్ ఇండియా యాప్‌కు సంబంధించి ‘వన్ పాస్- ఆల్ ఎగ్జామ్స్’ కూపన్ కోడ్‌ను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు గురువారం ఆవిష్కరించారు. రూ.99 ప్రీమియం ప్యాకేజీతో కూపన్ తీసుకున్నవారు అందులోని కోడ్ ద్వారా యాప్‌లోని విషయాలను అధ్యయనం చేయవచ్చని క్యాల్కస్ సంస్థ వెల్లడించింది. యాప్‌లో 1,354 క్యాటగిరీల పరీక్షల నుంచి 46 వేలకుపైగా టెస్టులను ఆరునెలలపాటు ఉచితంగా సాధన చేయవచ్చని పేర్కొన్నది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.