ముషీరాబాద్, జూలై 7: ఎమ్మార్పీఎస్ ఎస్సీ వర్గీకరణ సాధన మాదిగ అమరవీరులకు అంకితమిస్తూ.. మాదిగ, పీడిత ప్రజల హక్కుల కోసం నూతన ఉద్యమాల దిశగా పయనించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంతోమంది మాదిగ ఉద్యమకారుల త్యాగాల ఫలితమే మాదిగల చిరకాల స్వప్నమైన ఎస్సీవర్గీకరణ సాకారమైందని అన్నారు. తర్వలో రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించి, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యుడు పేర్ల మధు, విద్యార్థి నాయకులు కొల్లూరి వెంకట్, వరిగడ్డి చందు, ధర్మారపు శ్రీకాంత్, ఎల్ నాగరాజు, గుమిదెల్లి తిరుమల్లేశ్, జన్నారపు జీవన్, కానుగంటి సురేశ్ , బోడ మణి తదితరులు పాల్గొన్నారు.