హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మాడల్ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసాచారిని కలిసి నోటీసు అందజేశారు.
మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, కారుణ్యనియామకాలు చేపట్టాలని, హెల్త్‌కార్డులు, జేఎల్ వేతనం, 2013 నుంచి 2018 వరకు రావాల్సిన సీపీఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్ విడుదల చేయాలని కోరారు.