హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఫ్యామిలీ పార్టీ కేసులో రాజ్‌పాకాల శుక్రవారం చేవెళ్ల ఎక్సైజ్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. న్యాయవాదితో కలిసి వచ్చిన రాజ్ పాకాలను రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆధ్వర్యంలో విచారించారు.
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లాలో ఏర్పాటు చేయనున్న సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీకి 211.26 ఎకరాలను కేటాయిస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు జిల్లా కేంద్రంలోని రూ.10. 58 కోట్ల విలువైన స్థలాన్ని యూనివర్సిటీకి అప్పగిస్తున్నట్టు వెల్లడించింది.