నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన సోమవారం బాసర సరస్వతీ అమ్మవారు స్కందమాతా రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు చేయించారు. ఆలయంలో సుహాసిని పూజ, మంత్రపుష్పం, మూల నక్షత్రపూజ, అర్చకులు నిర్వహించారు. ఆరో రోజు భక్తులకు సరస్వతీ అమ్మవారు కాత్యాయని రూపంలో దర్శనం ఇవ్వనున్నారు.
– బాసర