హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): జాతీయంగా మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీ మ్యాట్ షెడ్యూల్ను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ పరీక్షను 2025 జనవరి 25న నిర్వహిస్తారు. డిసెంబర్ 13 వరకు దరఖాస్తుల గడువు ఉండగా, అదేనెల 14 వరకు ఫీజు చెల్లించవచ్చు. జనవరి 17న పరీక్ష జరిగే పట్టణాల పేర్లను ప్రకటిస్తారు. జనవరి 20 నుంచి అడ్మిట్కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.